manchi kaapari maa prabhuvu మంచి కాపరి మాప్రభు యేసే....
మంచి కాపరి మాప్రభు యేసే.... మా కొరకు ప్రాణ మిచ్చే గొప్ప కాపరి మరణ మన్నను భయము లేదులే మదురమైన ప్రేమతో మమ్ము కాయులే1. పచ్చిక భయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా చేయివిడువకా తోడు నిలచును నీతి మార్గమందు మమ్ము నడువజేయును "మంచి"2. అందకారలోయలో మా పయనంలో లేదులే మాకు భయం అభయం తానే ఆదరించును ఆశీర్వదించును అన్ని తావులయందు తానే తోడైయుండును "మంచి"3. శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపా క్షేమమే బ్రతుకు నిండగా పొంగి పొర్లగా చిరకాలం ఆయనతో జీవింపగా "మంచి"