manchi devudu bhale manchi మంచి దేవుడు భలే మంచి దేవుడు
మంచి దేవుడు భలే మంచి దేవుడు నిజ దైవం యేసు - అద్వితీయ దేవుడు 1. మ్రొక్కులను కోరడు - మనసిస్తే చాలును కొండలెక్కి రమ్మనడు - మనలో కొలువుంటాడు వెదికితే ప్రతి వారికి - దొరికేను యేసు పిలిచే ప్రతి వారికి - పలికేను యేసు బొమ్మ కాదయ్యో - జీవమున్న దేవుడు "మంచి"2. కుంటివాడు గంతులేయ - కాళ్ళ నొసగినాడు మూగవారు స్తుతిచేయ - నోటినిచ్చినాడు బధిరులు తన స్వరము విన - చెవులిచ్చినాడు ప్రేమా మయుడు - ఆశ్చర్య దేవుడు "మంచి"3. చెప్పింది చేసెను - మాదిరుంచి వెళ్ళెను అడుగు జాడాలుంచెను - అనుసరించ కోరెను మరణాన్ని జీవాన్ని - మన ఎదుటే వుంచెను ఎంచుకొనే స్వేచ్చను - మన చేతికిచ్చెను ఏమి చేతువో - సృష్టికర్త యేసుని "మంచి"