మధురం మధురం దైవ వాక్యం
madhuram madhuram dhiva vaakyam
మధురం మధురం దైవ వాక్యం తేనెకన్న మధురం దేవుని వాక్యం చీకటి నిండిన వీదులలో కాంతిని వెదజల్లు దైవవాక్యంఅ.ప:జీవమున్న వాక్యం,జీవమిచ్చు వాక్యం దేవుని దివ్య వాక్యం...1. ఖడ్గము కంటెను వాడిగలది ప్రాణాత్మలను విభజించెడి వాక్యం హృదయమునందలి చింతలను పరిశోదించెడి దైవ వాక్యం "జీవమున్న"2. నాహృదయములో దైవ వాక్యం పదిలపరచుకొని యున్నందున పాపములో...నే తడబడకుండ అడుగులు కాపాడు దైవ వాక్యం "జీవమున్న"3. కష్టములలోన దైవవాక్యం నెమ్మది నిచ్చి నడిపించును అలసిన,కృంగిన వేళలలో జీవింపచేయు దైవ వాక్యం "జీవమున్న"