• waytochurch.com logo
Song # 5903

maarani devhudavu neevenaiah మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా


మారని దేవుడవు నీవేనయ్యా - మరుగై ఉండలేదు నీకు యేసయ్యా
సుడులైనా సుడిగుండాలైనా - వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా -2

1. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే - 2
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా - 2 "మారని"

2. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే - 2
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచూ
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా - 2 "మరని"

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com