naa praana priyuda naa yesu raaja naa yelinavaada నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా
నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా నా యేలినవాడా...ఆ - నా స్నేహితుడా - 2 నిన్ను చేరాలనీ... నీతో ఉండాలనీ... - 2 నిన్ను వలచానయా... నీవు నా సొంతం నిన్ను వలచానయ్యా... యేసయ్యా నీవు నా సొంతం ||నాప్రాణ ||1. నీస్వరమునే వింటిని ప్రాణము సొమ్మసిల్లె యేసయ్యా నీ ముఖమునే చూచితిని మనసానందమాయనహా - 2 నీ ప్రేమను రుచిచూచితి నీ వశమయితిని యేసయ్యా - 2 ||నాప్రాణ ||2. నీ చేయినే పట్టుకొని నీతో నడవాలనుంది యేసయ్యా నీ భుజమును నేనానుకొని నీతో బ్రతకాలనుంది యేసయ్యా - 2 నిన్ను హత్తుకొని నీవడిలోన నిదురించాలని వుందయా - 2 ||నాప్రాణ ||