కళ్యాణ వేడుక – రమణీయ గీతిక
kalyaana veduka
కళ్యాణ వేడుక – రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక – సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక 1. వివాహ వ్యవస్థను చేసిన దేవుడుమొదటి వివాహము జరిగించినాడు సంఘ వదువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు ఈనాటి పెళ్ళికి కారణభూతుడు కడపటి పెళ్ళికి ఆయనే వరుడు 2.ఒకరికి ఒకరు సహకారులుగాసంతోషముతో ఇల జీవించగా సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా పరిశుద్ధుడే కలిపె ఇరువురిని ఒకటిగా 3.కిలకిల రవళుల వీణెలు మ్రోగెనుఆనంద లహరుల సందడి సాగెను పరలోక దూతల సంతోష గానాలు బంధుమిత్రుల అభినందన మాలలు ఆ జంట కనులలో వెలిగే కాంతులు