తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ
teepi aashala mandaaraalu
తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసులు సింధూరాలు కలబోసిన శుభవేళ అనురాగంతో ఒకటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆ.ప. ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం దీవిస్తూ శుభముగ మీ పరిణయం 1. ఇన్నినాళ్లుగా వేచిన సమయం ఎదురు నిలచిందిచిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది కలకాలం మీరు కలసి ఉండాలని చిరజీవం మీపై నిలిచి ఉండాలని 2.త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల నెరవేరిందిఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగ మారింది అరమరికలు లేక ఒకటి కావాలని పరలోక తండ్రికి మహిమ తేవాలని