Yehova Kattina Illu idi యెహోవ కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది
యెహోవ కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్ఠమై మరువరాని బంధమిది /2/ 1.ఒంటరి బ్రతుకులు మరవాలని – జంటగ సతతం నిలవాలని /2/ ఒకటిగ చేతులు కలపాలని – అన్యోన్యతతో మెలగాలని /2/అన్యోన్యతతో మెలగాలని .. /యెహోవ/2.లోక వాంఛలు విడవాలని – వాక్య కాంతిలో నడవాలని /2/దేవుని దయలో ఎదగాలని – జ్యోతులుగా ఇల నిలవాలని /2/ జ్యోతులుగా ఇల నిలవాలని .. /యెహోవ/