• waytochurch.com logo
Song # 5947

prabhuva na prardhana ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా


ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా

కారుచీకటి వేళలో నా దారి కానక పోయెనే
నమ్మిన ఆ స్నేహమే నన్ను ఒంటరి(ని)గా చేసెనే
కాదనని ప్రేమకై (నే) నిన్ను చేరితినయ్యా (2)

మరపురాని నిందలే నా గాయములను రేపెనే
మదిలో నిండిన భయములే నన్ను కృంగదీసెనే
నన్ను మరువలేని ప్రేమకై (నే) నిన్ను చేరితినయ్యా (2)

నేను చేసిన పాపమే నాకు శాపమై మిగిలెనే
నాదు దోష కార్యములే నన్ను నీకు దూరము చేసెనే
నన్ను మన్నించే ప్రేమకై (3) నిన్ను చేరితినయ్యా (2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com