ninnu vidichi poledu నిన్ను విడచి పోలేడు నిన్ను మరచి పోలేడు
నిన్ను విడచి పోలేడు నిన్ను మరచి పోలేడు
నీ కొరకే దిగి వచ్చాడు నీ కోసం మరణించాడు
తన చేతులతో చేసెను తన ఊపిరిని పోసెను
తన రూపులో తన పోలికలో నిన్ను నన్ను చేసెను
గాయములెన్నో నొందెను బహుదెబ్బలు పొందెను
నడి వీధిలో నలుగురిలో నలిగి విరిగి పోయెను
నిన్ను విడచిపోగలడా నిన్ను మరచిపోగలడా
ప్రాణంగా ప్రేమించెగా తన ప్రాణాన్నే నీకిచ్చెగా
నీ కోసమే కల్వరిలో రక్తమంతా కార్చెగా
నిన్ను విడచిపోగలడా నన్ను మరచి పోగలడా
నా కొరకే దిగివచ్చెగదా నా కోసం మరణించెగదా
నన్ను విడిచిపోలేడు నన్ను మరిచిపోలేడు