• waytochurch.com logo
Song # 5966

daagunnava neevu dagunnava దాగున్నావా నీవు దాగున్నావా సంఘాన్ని చెడిపేవాడా


దాగున్నావా నీవు దాగున్నావా సంఘాన్ని చెడిపేవాడా
నీవు నా కనులను దాయగలవు గానీ
ఆ దేవుని కళ్ళను దాయలేవుగా

పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు
చేస్తావు నీవు సాతాను క్రియలు (2)
ఈ లోకపు దృష్టిలో పరిశుద్ధుడవైనా
పరలోకంలో నీ స్థానమేమిటో

తోటివానిపైన నీకెందుకయ్య కోపం
ఆ కోపం పైవానికి ఎందుకయ్యభారం (2)
నీ కాలం చెల్లునాడు నీతోడు రాడు
ఎందుకయ్యనీకింకా వానితో గోడు

పాడు పదవిపైనా నీకెందుకయ్యమోహం
ఆ మోహంలో బ్రతుకు బలౌతుంది ఖాయం (2)
పదవి అనే పదనిసలో ప్రభుని మరచినావో
పరలోకంలో నీ పేరు మాయమౌను


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com