• waytochurch.com logo
 • Song - 5977 : nee krupa leni kshanamu nee daya leni kshanamu యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా Lyrics

 • Quick search
 • nee krupa leni kshanamu nee daya leni kshanamu యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా Lyrics in Telugu


  యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
  నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

  నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
  నేనూహించలేను యేసయ్యా (2)
  యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
  నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప||

  మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
  మార్గముగా మారి మనిషిగా మార్చావు
  మహిని నీవు మాధుర్యముగా మార్చి
  మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
  మహిమలో నేను మహిమను పొంద
  మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||

  ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
  ఆపత్కాలమున ఆదుకొన్నావు
  ఆత్మీయులతో ఆనందింప చేసి
  ఆనంద తైలముతో అభిషేకించావు (2)
  ఆశ తీర ఆరాధన చేసే
  అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||

  Language:Telugu | 10511 | Write Comment
 • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6465842
 • title
 • Name :
 • E-mail :
 • Type

© 2018 Waytochurch.com