bedham emi ledu బేధం ఏమి లేదు – అందరును పాపం చేసియున్నారు
బేధం ఏమి లేదు! – అందరును పాపం చేసియున్నారు, దేవాదిదేవుడు ఇచ్చే ఉన్నత మహిమను – పోగొట్టుకున్నారు /2/ఏ కులమైన మతమైన జాతైన రంగైన – దేవుని దృష్టిలో అందరు పాపులే /2/బేధం/1. ఆస్తి పాస్తులు ఎన్నున్నా – నిత్యరాజ్యము నీకివ్వవు విద్యార్హతలు ఎన్నున్నా – సంతోషాన్ని నీకివ్వవు సమసిపోయే ఈలోకము – ఆశ్రయాన్ని నీకివ్వదు తరిగిపోయే ఈ కాలము – కలవరాన్ని తీర్చదు నీవేవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసులేకుంటే నీకున్నవన్ని సున్న /2/బేధం/2. పుణ్యకార్యాలు చేసినా – పవిత్రత నీకు రాదుగా తీర్ధ యాత్రలు తిరిగినా – తరగదు నీ పాపము పరమును వీడిన పరిశుద్ధుడేసు – రక్తము కార్చెను సిలువలో కోరికోరి నిను పిలిచెను – పరమ రాజ్యము నీకివ్వగ నీ స్థితి ఏదైనా – గతి ఏదైనా వృత్తేదైనా భ్రుతి ఏదైనా కలువరి నాధుడే రక్షణ మార్గము /2/బేధం/