• waytochurch.com logo
Song # 5992

deva nee aavaranam maakento sreyaskaram దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం


దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం
ఒక ఘడియా యిచట గడుపుట మేలు వేయి దినములకంటేను

1. అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ….
అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా
అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో
ఆల్ఫా ఒమెగయు ఆత్మ రూపుడవు
ఆనందించగ నీ మదిలో #దేవా#

2. అత్యంత పరిషుద్ధమౌ ఆ…. నీడుగూడారమున ఆ…..
నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితీవి నీ దయన్
జు౦టి ధారల కన్నాను తేనె మధురిమ కన్నాను
శ్రేష్టమౌ నీదువాక్కులచేత- మము తృప్తి పరచుమయా #దేవా#

3. పరిషుద్ద సన్నిధిలో ఆ… పరిశుధ్దాత్ముని నీడలో ఆ….
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం
మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం
ప్రాణ ప్రియుడవు పదముల చేరి – ప్రాణార్పణము జెతుము#దేవా#


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com