ee loka yaathraalo ne saaguchunda ఈ లోక యాత్రాలో నే సాగుచుండ
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2)ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2)అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2) ||ఈ లోక||1. జీవిత యాత్ర ఎంతో కఠినము (2)ఘోరాంధకార తుఫానులున్నవి (2)అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2)కాయు వారెవరు రక్షించేదెవరు (2) ||ఈ లోక||2. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)అనుదినము నన్ను ఆదరించెదవు (2)నీతో ఉన్నాను విడువలేదనెడు (2)నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) ||ఈ లోక||3. తోడై యుండెదవు అంతము వరకు (2)నీవు విడువవు అందరు విడచినను (2)నూతన బలమును నాకొసగెదవు (2)నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2) ||ఈ లోక||