chinnaari baalagaa chirudivya jyothigaa చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగా
చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగాకనరాని దేవుడు కనిపించెనాతన ప్రేమ నా పైన కురిపించెనా… కురిపించెనాజో.. లాలిజో.. జో… లాలిజో…పరలోక భోగాలు వర దూత గానాలుతనకున్న భాగ్యాలు విడనాడెనా (2)పాపాలు భరియించెనా – శాపాలు భరియించెనాఆనందమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే ||జో లాలిజో||దావీదు తనయుండై మహిమా స్వరూపుండైమానుజావతారుండై పవళించెనా (2)గాఢాంధకారంబున ఒక తార ఉదయించెనాప్రభు బాలుడై ప్రభు యేసుడు మరియమ్మ ఒడిలోన నిదురించెనా ||జో లాలిజో||శాంతి స్వరూపుండు కరుణా సముద్రుండుకడు శక్తిమంతుడు కమనీయుడు (2)ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కర్తాయనేఅభిషిక్తుడు ఆరాధ్యుడు ప్రేమామయుడు ప్రియుడేసుడు ||జో లాలిజో||