devuni yamdu nirikshana numchi దేవుని యందు నిరీక్షణ నుంచి
దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా 1. ఏ పాయము రాకుండ నిన్ను దివారాత్రులు కాపాడు వాడు ప్రతిక్షణం నీపక్షముండు రక్షకుడు 2. చీకటిని వెలుగుగ చేసి ఆయన నీ ముందు పోవువాడు సత్యమగు జీవమగు మార్గము యేసే 3. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొను వాడు ఆయనే ఆధారము ఆధరణ ఆయనలో 4. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్న తండ్రికన్న ఉత్తముడు 5. నీకు విరోధముగా నిరూపించిన ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు శత్రువులు మిత్రులుగా మారుదురు 6. పర్వతములు తొలగి పోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు కనికర సంపన్నుడు నీ దేవుడు 7. స్తుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడెద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
Devuni yamdu nirikshana numchi Ayananu stutimchu na pranama 1. E payamu rakumda ninnu divaratrulu kapadu vadu Pratikshanam nipakshamumdu rakshakudu 2. Chikatini veluguga chesi ayana ni mumdu povuvadu Satyamagu jivamagu margamu yese 3. Niku sahayamu cheyuvadu sada adukonu vadu ayane Adharamu adharana ayanalo 4. Talli tana biddanu marachinanu maruvadu ni devudu ninnu Talli kanna tamdrikanna uttamudu 5. Niku virodhamuga nirupimchina evidha ayudhamunu vardhilladu Satruvulu mitruluga maruduru 6. Parvatamulu tolagi poyinanu tana krupa ninnu ennadu vidadu Kanikara sampannudu ni devudu 7. Stuti mahimalu nike prabu nityamu ninne koniyadeda Halleluya halleluya halleluya