• waytochurch.com logo
Song # 6086

silanaina nanu silpivai marchavu శిలనైన నను శిల్పివై మార్చవు

శిలనైన నను శిల్పివై మార్చవు
నా లోని ఆశలు విస్తరింపజేసావు (2)
నీ ప్రేమ నాపై కుమ్మరించు చున్నవు (2)
నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)

1) మొడుబారిన నా జీవితమును నీ ప్రేమతోనే చిగురింపజేసావు (2)
నీ ప్రేమ అభిషేకం నా జీవిత గమ్యం (2)
వర్ణించలేను లెక్కించలేను (2)
నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)

2) ఏ విలువ లేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు (2)
నా యెడల నీకున్న తలంపులు విస్తారం (2)
నీ కొరకై నేను జీవించు ఇళ్లలో (2)
నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)

3) ఊహించలేను నీ ప్రేమ మధురం
నీ ప్రేమముర్తి నీకే నా వందనం
నీ ప్రేమే నా జీవిత లక్ష్యం (2)
నీ ప్రేమ లేకుండా నేనుండలేను (2)
నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com