yaakobu baavi kaada yesayyanu choosaanammaa యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా
యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మాఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా (2)దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా (2)నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2) ||యాకోబు||అయ్యా నే సమరయ స్త్రీని – మీరేమో యూదులాయెమీకు మాకు ఏనాడైనా – సాంగత్యము లేకపాయె (2)నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా (2)చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2) ||యాకోబు||అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానేనీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే (2)అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే (2)లొపేమి ఎరగనట్టు లోగుట్టు దాచినానే (2) ||యాకోబు||నీకు భర్త లేడన్నాడే పెనిమిట్లు ఐదుగురుండేఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే (2)వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా (2)ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా (2) ||యాకోబు||నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడుఏ తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో (2)గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా (2)తప్పకుండ యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా (2) ||యాకోబు||