Saswathamyna prematho annu preminchavayya శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా నీ ప్రేమే నను గెల్చెను శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా నీ ప్రేమే నను గెల్చెను
శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను!విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్య! నీ కృపయే నను మార్చెను! నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ అమృతం, నీ ప్రేమ తేనెకంటే మధురము!నీ ప్రేమ లోతులో, నను నడుపు యేసయ్యా! నీ ప్రేమలోన నే వేరుపారి నీకై జీవించనా!ప్రేమతో ప్రేమతో - యేసయ్యా నిను వెంబడింతునుప్రేమతో ప్రేమతో ప్రేమతో - యేసయ్యా నిను ఆరాధింతును1.నా తల్లి గర్భమునందు, నే పిండమునైయుండంగా, దృస్టించి నిర్మించిన ప్రేమనా దినములలో ఒకటైనా, ఆరంభము కకమునుపే, గ్రంధములో లిఖియించిన ప్రేమనా ఎముకలను, నా అవయవములను, వింతగా ఎదిగించి రూపించినప్రేమతల్లి ఒడిలో నేను, పాలు త్రాగుచున్నపుడు, నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమప్రేమతో ప్రేమతో - నీ కోసం నను సృజియించావయా! ప్రేమతో ప్రేమతో ప్రేమతో - నను మురిపింగా లాలించావయా!2.నే ప్రభువును ఎరుగకయుండి అజ్ఞానములో ఉన్నపుడు, నను విడువక వెంటాడిన ప్రేమనా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనపుడు, నా కోసం వేచిచూచిన ప్రేమబాల్యదినములనుండి నను సంరక్షించి కంటిరెప్పలా నన్ను కాపాడిన ప్రేమయౌవ్వన కాలమున కృపతో నను కలిసి సత్యమును బోధించి వెలిగించిన ప్రేమనే వెదకకున్ననూ నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమప్రేమతో ప్రేమతో - యేసయ్యా నను దర్శించావయా! ప్రేమతో ప్రేమతో ప్రేమతో - నను ప్రత్యేకపరచావేసయా!3.నే పాపినై యుండగానే, నాకై మరణించిన ప్రేమ , తన సొత్తుగ చేసుకున్న ప్రేమవిలువే లేనట్టీ నాకై, తన ప్రాణపు వెల చెల్లించి, నా విలువను పెంచేసిన ప్రేమలోకమే నను గూర్చి, చులకన చేసిననూ, తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమఎవ్వరూ లేకున్నా, నేను నీకు సరిపోనా, నీవు బహుప్రియుడవని బలపరచిన ప్రేమనా ముద్దుబిడ్డ నీవంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమయేసయ్యా! యేసయ్యా! - నాపై యింత ప్రేమ ఏంటయా! యేసయ్యా! యేసయ్యా! యేసయ్యా! - నను నీలా మార్చేందులకేనయా!4. పలుమార్లు నే పడినపుడు బహు చిక్కులలోనున్నపుడు కరుణించి పైకి లేపిన ప్రేమనేనే నిను చేశానంటూ నేనే భరియిస్తానంటూ నను చంకన ఎత్తుకున్న ప్రేమనా తప్పటడుగులను, తప్పకుండ సరిచేసి, తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమనన్ను బట్టి మారదుగా, నన్ను చేరదీసెనుగా, షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమతనకిష్టమైన, ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమప్రేమతో! ప్రేమతో! - నను మరలా సమకూర్చావేసయా!ప్రేమతో! ప్రేమతో! ప్రేమతో! - నీ సాక్ష్యంగా నిలబెట్టావయా!5.కష్టాల కొలుముల్లోన, కన్నీటి లోయల్లోన నా తోడై ధైర్యపరచిన ప్రేమచెలరేగిన తూఫానులలో ఎడతెగని పోరటంలో తన మాటతో శాంతినిచ్చిన ప్రేమలోకమే మారిననూ, మనుష్యులే మరచిననూ మరువనే మరువదుగా నా యేసు ప్రేమతల్లిలా ప్రేమించి, తండ్రిలా బోధించి ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ క్షణమాత్రమైనా నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ!ప్రేమతో! ప్రేమతో! - నా విశ్వాసం కాపాడావయా ప్రేమతో! ప్రేమతో! ప్రేమతో! - బంగారంలా మెరిపించావయా!6.ఊహించలేనటువంటి కృపలను నాపై కురిపించి నా స్థితిగతి మార్చివేసిన ప్రేమనా సొంత శక్తితో నేను ఎవ్వరును పొందగ లేని అందలమును ఎక్కించిన ప్రెమపక్షిరాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ శిఖరము పై నన్ను నడిపించు ప్రేమపర్వతాలపై ఎప్పుదూ, క్రీస్తు వార్త చాటించే సుందరపు పాదములు నా కిచ్చిన ప్రేమతన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ!ప్రేమతో! ప్రేమతో! - శాశ్వత జీవం నాకిచ్చావయా ప్రేమతో! ప్రేమతో! ప్రేమతో! - నను చిరకాలం ప్రేమిస్తావయా!