Vadabarani viswasamutho వాడబారని విశ్వాసముతో
వాడబారని విశ్వాసముతో }శుభప్రదమైన నిరీక్షణతో }॥2॥వేచియున్నానయ్యా...కనిపెట్టుచున్నానయ్యా...యేసయ్యా ॥2॥నీ రాకకోసమై కడబూర శబ్దముకైనీ మహిమ కోసమై నిన్ను చేరుటకై ॥వాడబారని॥ 1॰మోకాళ్ళపై వేచితీ... }కన్నీళ్ళ పర్యంతమై... }బీడు బారిన నేల వానకై... }॥2॥యెదురుచూచిన చందమై... }సిధ్ధపడియున్న వధువునై... }ఆశతో వేచానయ్యా...యేసయ్యా }॥2॥ ॥నీ రాకకోసమై॥ 2॰లేఖనములను చూచితి.... }గురుతులు గమనించితీ.... }ప్రవచన నెరవేర్పులన్నీ.... }॥2॥జరుగుట గుర్తించితీ.... }రారాజువై నీవు రావాలనీ... }యెదురుచూచు చున్నానయ్యా.....}॥2॥యేసయ్యా } ॥నీ రాకకోసమై॥ 3॰నీతి కొరకై వేచినా }గూడబాతును పోలిన }ఆత్మ దాహము తోడ నిండి }॥2॥అల్లాడుచున్నానయ్య........ }లోక బంధాల నుండి }నీ చెలిమి కోరానయ్యా......}॥2॥ ॥నీ రాకకోసమై॥