• waytochurch.com logo
 • Song - 629 : devarani divenalu dharalamuganu vir దేవరనీ దీవెనలు ధారళముగను వీరలపై Lyrics

 • Quick search

 • దేవరనీ దీవెనలు ధారళముగను వీరలపై
  బాగుగా వేగమే దిగనిమ్ము
  పావన యేసుని ద్వారగను

  1. దంపతులు దండిగనుధాత్రిలో వెలయుచు సంపదలన్
  సొంపుగ నింపుగ పెంపగుచు
  సహింపున వీరు సుఖించుటకై

  2. ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో
  శోకము లేకయె యేకముగా
  బ్రాకటముగను జేకొనుము

  3. ఇప్పగిది నెప్పడును గొప్పగు ప్రేమతో నొప్పచు దా
  మొప్పిన చొప్పన దప్పకను
  మెప్పగ బ్రతుకగ బంపు కృపన్

  4. తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా
  గాపుగ బ్రాపుగ దాపునుండి
  యాపదలన్నియు బాపుచును

  5. సాదులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగా
  కదలక పదవక ముదమున నీ
  పాదము దాపున బాపున బాదుకొనున్

  6. మెండుగ భూమండలపు గండములలో వీరుండగను
  తండ్రిగ దండిగ నండి నుండి
  వెండియు వానిని ఖండించవే

  7. ఇద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై
  శ్రద్దతో బుద్దిగా సిద్దపడన్
  దిద్దుము నీ ప్రియబిడ్డలుగను

  8. వాసిగ నీ దాసులము చేసిన యీ మొఱల్ దీసికొని
  మా సకలేశ్వర నీ సుతుడౌ
  యేసుని పేరిట బ్రోవు మామెన్

  Language:TELUGU | 2062 | Write Comment
 • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5536528
 • title
 • Name :
 • E-mail :
 • Type

© 2018 Waytochurch.com