dinadinambu yesuku daggaraga cherut దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసుని నామదిలో కోరుతా
ఎల్లప్పుడు యేసువైపు కనులెత్తి పాడుతా
ప్రభుని మాట నాదు భాట విభుని తోనే సాగుతా
1. మారిపోయే లోకమందు మనుష్యులెంతో మారినా
మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడ చేరనా
2. దైవ వాక్యం జీవ వాక్యం దిన దినంబు చదువుతా
ప్రభుని మాట నాదు భాట విభునితో మాట్లాడుతా
3. ఎన్నడు ఎడబాయడు నను విడువడు ఏ మాత్రము
ప్రభువే నాదు అభయము భయపడను నేనేమాత్రము
4. పరిశుద్దముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెద
సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా
Dinadinambu yesuku daggaraga cheruta
Anukshanambu yesuni namadilo koruta
Ellappudu yesuvaipu kanuletti paduta
Prabuni mata nadu bata vibuni tone saguta
1. Maripoye lokamamdu manushyulemto marina
Maruna prabu yesu prema asatoda cherana
2. Daiva vakyam jiva vakyam dina dinambu chaduvuta
Prabuni mata nadu bata vibunito matladuta
3. Ennadu edabayadu nanu viduvadu E matramu
Prabuve nadu abayamu bayapadanu nenematramu
4. Parisuddamuga anukulamuga jivayagamai nilicheda
Siluva mosi seva cheya yesutone kaduluta