• waytochurch.com logo
Song # 66

pradhana vinedi pavanuda ప్రార్ధన వినెడి పావనుడా ప్రార్ధన మాకు నేర్పుమయా


పల్లవి: ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా ..ప్రార్ధన..

1. శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి
పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక ప్రార్ధన నేర్పుమయా ..ప్రార్ధన..

2. పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగ మోడ్చి = శిరమును
వంచి సరిగమ వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా ..ప్రార్ధన..

3. దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యు
దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా ..ప్రార్ధన..

4. శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపై నిను జంపగను
శాంతముతో నీ - శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా ..ప్రార్ధన..


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com