kannulumdi chudaleva yesu mahimanu కన్నులుండి చూడలేవా యేసు మహిమను
కన్నులుండి చూడలేవా యేసు మహిమను
చెవులుండి వినలేవా యేసు మాటను
నాలుకుండి పాడలేవ యేసు పాటను
కాళ్ళు ఉండి నడువ లేవ యేసు భాటలో
1. చెడును చూడకుండ నీ కనులను
చెడును వినకుండ నీ చెవులను
చెడును పలుకకుండ నీ నాలుకన్
చెడును నడువ కుండ నీ కాళ్ళను
దూరముగా నుండు ఓ సోదరా
దూరముగా నుండు ఓ సోదరీ
2. దుష్టుల ఆలోచన చొప్పున
నడువక సాగుమా నీ యాత్రలో
పాపుల మార్గముందు నీవు నిలువక
ఆపహాసకులు కూర్చుండు చోటన
కూర్చుండకుమా ఓ సోదరా
కూర్చుండకుమా ఓ సోదరీ