• waytochurch.com logo
  • Song - 696 : kanumuyaka mumde telusuko o nijanni కనుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని Lyrics

  • Quick search

  • కనుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని
    ఈ భూమిపై ఎందరో పుట్టారు
    ప్రతి పుట్టినరోజు చావుకు దగ్గరవుతారు
    తినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పి
    నిన్ను అర్ధాంతరంగా వదిలివేస్తుంది
    మట్టి నుండి పుట్టింది మట్టికి చేరింది
    ఆరని అగ్నికి అత్మను పంపేస్తుంది
    తెలుసుకో ఈ నిజాన్ని
    నీ శరీరమే నీకు శత్రువని

    1. మేనుపైన మమకారం పెంచుకోకుమా
    మరణించగానే ఎవరూ నిను ఉంచుకోరు సుమా
    ఆశా మమకారాలు పెను ఉచ్చులు సుమా
    నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలనీ మరువకుమా
    తెలుసుకో ఈ నిజాన్ని

    2. నీ దేహం దేవునికై వినియోగిస్తే
    నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే
    మన్నయిన నీ దేహం మహిమగా మారును
    అంతరిక్షమే దానికి అడ్డుతొలగి పోవును
    పుట్టి తెలుసుకున్నావీ లోకముందని
    మరణిస్తే తెల్లుస్తుంది మరోలోకముందనీ
    తెలుసుకో ఈ నిజాన్ని
    నీ మృత్యువు వెనుకే ఉంది మిష్టరీ
    దైవ గ్రంధం తెలిపింది దాని హిష్టరీ
    కనుమూయక ముందే తెలుసుకో ఈ నిజాన్ని

    Language:TELUGU | 936 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5558206
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com