mahima gala tandri mamchi vyavasaya మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు
మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు
మహితోటలో నరమొక్కలు నాటించాడు
తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు
కాయవే తోట కమ్మని కాయలు
పండవే చెట్టా తియ్యని ఫలములు
1. నీతిపోత జాపికాపు ఆత్మశుద్ధ ఫలములు
నీతండ్రి నిలువ చేయు నిత్యజీవ నిధులు
అనంతమైన ఆత్మపొందు అమర సుఖశాంతులు
అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు
2. అపవాది వెంటబడ కుంటుపడిపోకుము
కాపు పట్టి చేదు పళ్ళు గంపలుగా కాయకు
వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు
అదిగో గొడ్డలి వేరున పదును పెట్టియున్నది