yehova ni namamu యెహోవా నీ నామము ఎంతో బలమైనది
పల్లవి: యెహోవా నీ నామము - ఎంతో బలమైనది ...ఆ...ఆ...ఆ... యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...|| యెహోవా || 1. మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి || యెహోవా || 2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి || యెహోవా || 3. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము || యెహోవా || 4. చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను || యెహోవా ||