yehova dhayaludu యెహోవా దయాళుడు
పల్లవి: యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత - స్తుతి చెల్లించుడి కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి 1. నాకము వర్షించినా - లోకము నశించినా మీకు అండగా - నిలిచిన విభునకు కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి 2. కరువులు కలిగినను - మరణము వచ్చినను కరుణతో కొరతలను - తీర్చిన ప్రభునకు కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి 3. ఆపదలే రానీ - అపనిందలే గానీ కాపరియై మిమ్ము - గాంచిన క్రీస్తుకు కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి