randeho vinarandeho రండహో వినరండహో శుభ వార్త ఒకటి వినిపించెదం
పల్లవి: రండహో వినరండహో శుభ వార్త ఒకటి వినిపించెదం సంతోషముతో దరి చేరండి సంభ్రాలతో యిక స్తుతి కలపండి (2X) .. రండహో 1. అలనాడు బెత్లేహేము పశుల పాకలో కన్నియ మరియకు శిశువు పుట్టెను (2X) గొల్లలు జ్ఞానులు కానుకలతో స్తుతులర్పించిరి (2X) ||రండహో|| 2. ప్రవచనమునుబట్టి అభిషక్తుడవతరించె భూరాజులకదిఎంతో భీతి కలిగించెన్ (2X) అంతము చేయ దలచినంత దూత గణం రక్షించెన్ (2X) సంభ్రాలతో యిక శృతి కలపండి ||రండహో|| 3. నాటి నుండి నేటి వరకు కృపతో తోడుండి పరమందు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నా (2X) యేసుని జన్మ శుభాశిస్సులందు కొనరండి (2X) సంభ్రాలతో యిక శృతికలపండి ||రండహో||