randi yehova రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము
పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X) ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2X) ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2X) 1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2X) ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2X) ... రండి … 2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2X) అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2X) ... రండి … 3. త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని (2X) నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము (2X) ... రండి …