ni mukamu manoharamu ni svaramu mad నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యమ
నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిను వీడి క్షణమైన
1. నీవే నాతోడువై నీవే నాజీవమై నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై నను ఎన్నడు వీడని అనుబంధమై
2. నీవే నా శైలమై నీవే నాశృంగమై నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు
3. నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై నను మైమరచి నేనేమి చేసేదనో
Ni mukamu manoharamu ni svaramu madhuryamu
Ni padalu aparamji mayamu
Yesayya na prana priyuda managalana ninu vidi kshanamaina
1. Nive natoduvai nive najivamai na hrudilona nilichina jnapikavai
Anuvanuvuna nikrupa nikshiptamai nanu ennadu vidani anubamdhamai
2. Nive na sailamai nive nasrumgamai na vijayanike nivu bujabalamai
Anukshanamuna satruvuku pratyakshamai nanu venudiyaniyaka vennu tattinavu
3. Nive veluguvai nive alayamai na nityatvamunaku adyamtamai
Amaralokana suddhulato parichayamai nanu maimarachi nenemi chesedano