ruchi choochi yerigithini రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
పల్లవి: రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియురక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని || రుచి చూచి|| 1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవేతప్పక ఆరాధింతు దయాళుడవు నీవే || రుచి చూచి|| 2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడామనసారా పొగడదను నీ ఆశ్చర్యకార్యములన్ || రుచి చూచి|| 3. మంచి తనము గల దేవా అతి శ్రేష్టుడవు అందరిలోముద మార పాడెద నిన్నుఅతి సుందరడవనియు || రుచి చూచి|| 4. ప్రార్దింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరిసంపూర్ణముగా పొం దెదను అడుగువాటన్నిటికి || రుచి చూచి||