• waytochurch.com logo
Song # 79

ruchi choochi yerigithini రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు


పల్లవి: రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని || రుచి చూచి||

1. గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే || రుచి చూచి||

2. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
మనసారా పొగడదను నీ ఆశ్చర్యకార్యములన్ || రుచి చూచి||

3. మంచి తనము గల దేవా అతి శ్రేష్టుడవు అందరిలో
ముద మార పాడెద నిన్నుఅతి సుందరడవనియు || రుచి చూచి||

4. ప్రార్దింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొం దెదను అడుగువాటన్నిటికి || రుచి చూచి||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com