nimdu manasuto ninnu premimtunu నిండు మనసుతో నిన్ను ప్రేమింతును
నిండు మనసుతో నిన్ను ప్రేమింతును
నా పూర్ణ శక్తితో నిన్ను సేవింతును
నా సమస్తము నీకే అర్పింతును
సంపూర్ణ భక్తితో నిన్ను పూజింతును
నీతిమంతుడా నిర్మలాత్ముడా
లోకరక్షకా యేసూ . .
1. నీ నీడలో నన్ను నిలువనీయుము
నీ బాటలో నేను నడిచెద
నీ అత్మతో నన్ను నింపు ప్రభు
నీ సాక్షిగా నేను నిలిచెద
సజీవయాగముగా నా దేహమర్పింతును
నా బలము నా ఘనము నీకే సమర్పింతు
ఫలియింపజేయుము నన్ను
2. నీ నామము నేను మహిమపరచెద
నవ్యగీతిక నీకై పాడెద
సర్వసృష్టికి ఆధారభూతుడ
గంభీర ధ్వనులతో అరాధించెద
నీ నామ మాధుర్యం లోకానికి చాటిచెప్పెద
నీ ప్రేమ వాత్సల్యం అందరికి చూపించెద
మనసారా ప్రేమింతు నిన్ను
Nimdu manasuto ninnu premimtunu
Na purna saktito ninnu sevimtunu
Na samastamu nike arpimtunu
Sampurna baktito ninnu pujimtunu
Nitimamtuda nirmalatmuda
Lokarakshaka yesu . .
1. Ni nidalo nannu niluvaniyumu
Ni batalo nenu nadicheda
Ni atmato nannu nimpu prabu
Ni sakshiga nenu nilicheda
Sajivayagamuga na dehamarpimtunu
Na balamu na ganamu nike samarpimtu
Paliyimpajeyumu nannu
2. Ni namamu nenu mahimaparacheda
Navyagitika nikai padeda
Sarvasrushtiki adharabutuda
Gambira dhvanulato aradhimcheda
Ni nama madhuryam lokaniki chaticheppeda
Ni prema vatsalyam amdariki chupimcheda
Manasara premimtu ninnu