• waytochurch.com logo
Song # 80

lekhaleni chukalenno లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ

పల్లవి: లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ (2X)
చెప్పకుండ వెళ్ళిపోయె చక్కని చుక్క - దుఃఖమే విడిచిపోయె చక్కని చుక్క (2X)

… లెక్కలేని…

1. ప్రభువునందు మృతులే మరి ధన్యులని - విభుని చెంత చేరుటయే గమ్యమని (2X)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2X)

… లెక్కలేని…
2. దేహమందు నివశించుట వ్యర్ధమని - మోహమంత మరచుట పరమార్ధమని (2X)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2X)

… లెక్కలేని…

3. పాపలోకమందు బ్రతుకలేమని - ఆ పరమును చే్రుటయే మేలని (2X)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2X)

… లెక్కలేని…

4. యేసు ప్రభువు తిరిగి భువికి వచ్చునని - మృతులనుండి తనను తిరిగి లేపునని(2X)
ఆలకించెనెక్కడో చక్కని చుక్క - ఆలసింపక వెళ్ళిపోయె చక్కని చుక్క (2X)

… లెక్కలేని…

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com