o oho kraistavuda ohoho visvasi ఓఓహో క్రైస్తవుడా ఓహోహో విశ్వాసి
ఓఓహో క్రైస్తవుడా ఓహోహో విశ్వాసి
నిరాశ మాటలు పలుకొద్దురా నిరీక్షణతో కొనసాగరా
దేవుని వాగ్దనం నమ్ముమురా
జీవపు మాటలు పలుకుమురా
1. నిరాశలో ఉన్న అబ్రాముకు
నక్షత్రములు చూపెను దేవుడు (2)
నిరాశను పారద్రోలెనురా నిరీక్షణతో కొనసాగెరా
వాగ్దానములను నమ్మెనురా
వాగ్దాన పుత్రుని పొందెనురా (2)
2. నిరాశలో ఉన్న పేతురు
తన దోనె యేసుకు ఇచ్చెను (2)
ఆయన మాటలు నమ్మెనురా
చేపలతో తనదోనెనిండెనురా
యేసయ్యను వెంబడించెనురా
మనుష్యుల జాలరి ఆయెనురా (2)