randi yutsahimchi padudumu rakshana రండి యుత్సహించి పాడుదుము రక్షణ దుర్
రండి యుత్సహించి పాడుదుము రక్షణ దుర్గము మన ప్రభువే
1. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదుము
సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము
2. మన ప్రభువే మహా దేవుండు ఘన మహాత్మ్యముగల రాజు
భూమ్యగాధపులోయలును భూధర శిఖరము లాయనవే
3. సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిజేసెన్
ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము
4. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును
5. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదినినిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగముల నౌను ఆమేన్
Randi yutsahimchi padudumu rakshana durgamu mana prabuve
1. Ramdi krutajjata stotramuto raraju sannidhi kegudumu
Satprabu namamu kirtanalan samtoshaganamu cheyudamu
2. Mana prabuve maha devumdu gana mahatmyamugala raju
Bumyagadhapuloyalunu budhara sikaramu layanave
3. Samudramu srushtimche nayanade satyuni hastame buvijesen
Ayana daivamu palitula mayana mepedi gorrelamu
4. A prabu sannidhi mokarimchi ayana mumdara mrokkudamu
Ayana matalu gaikonina nayyavi manakemto melagunu
5. Tamdri kumara suddhatmakunu dagu stuti mahimalu kalgugaka
Adininippudu nellappudu nayinatlu yugamula naunu amen