sageda nenu yesunilo sramayaina kar సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా
సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా
కృంగిపోను ఏనాడు కొదువ లేదు నా యేసులో
యేసు నాతో ఉంటే నాకు సంతోషమే
యేసు నాలో ఉంటే నాకు సమాధానమే . . .
1. తన రూపములో నను చేసికొని తన రక్తముతో పరిశుద్ధ పరచి
నూతన క్రియలు నాలో చేసి నా దోషములను క్షమించిన
2. తన రాజ్యములో నను చేర్చుకొని పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి
పర్వతములు తొలగిపోయిన భయపడకు అని వాగ్ధానమిచ్చిన