sarvakrupa nidi yagu prabhuva సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా
1. సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము - సంతోషముగ నిను పొగడెదము పల్లవి: హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయా హల్లెలూయ యని పాడెదను - ఆనందముతో సాగెదను 2. ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి పరిశుద్దముగ జీవించుటకై - పాపిని నను కరుణించితివి .. హల్లెలూయ.. 3. మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నను నింపితివి - మరణ భయములను తీర్చితివి .. హల్లెలూయ..