siluvachemta cherinanadu kalushamul సిలువచెంత చేరిననాడు కలుషములను కడిగి
సిలువచెంత చేరిననాడు కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి
1. కొండవంటి బండవంటి మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన పిలుచుచుండె పరము చేర
2. వంద గొర్రెల మందనుండి ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబదితొమ్మిది గొర్రెలవిడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్
3. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయె
తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రి యతని చేర్చుకొనెను
4. పాపి రావా పాపము విడచి పరిశుద్దుల విందులో చేర
పాపుల గతిని పరికించితివా పాతాలంబే వారి యంతం