sagipodhunu nenu aagi ponu nenu సాగి పోదును ఆగి పోను నేను
పల్లవి: సాగి పోదును - ఆగి పోను నేను విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు (2X) హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2X) 1. ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను (2X) నా సహాయకుడు - నా కాపరి యేసే (2X) …హల్లెలూయ… 2. పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా పగవాని బానములకైనా - నేను భయపడను (2X) నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే (2X) …హల్లెలూయ… 3. పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం (2X) నాకు కేడెము - నా కోటయు యేసే (2X) …హల్లెలూయ…