srusti kartha yesuni sthutinchedamu సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే
పల్లవి: సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము హ... హ.. హ... హ.. హల్లెలూయా... || 3 times || హల్లెలూ... యా పాడెదము 1. అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి నీదు మహిమను చూపితివే || సృష్టి || 2. అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను రూపించిన నిను పొగడెదను || సృష్టి || 3. భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది మనిషికి రూపము నిచ్చితివే || సృష్టి ||