srustipitha sarvonatha సృష్టి పితా సర్వో న్నతా సమర్పింతున్ సర్వస్వమున్
పల్లవి: సృష్టి పితా - సర్వో న్నతా = సమర్పింతున్ - సర్వస్వమున్ 1. భూమి ఆకాశము నీవే - భూధర శిఖరములు నీవే = భూ ప్రజలు నీవారే - బల శౌర్యములు నీవే 2. మా వెండి బంగారములు నీవే - మాకున్న వరములు నీవే = మా దేహముల్ - మా గేహముల్ మా జీవితము నీవే 3. వెల లేని గాలి వెలుతురులు - విలువైన పాడి పైరులు = వివిధంబులైన దీవెనలు - నీ కరుణా వర్షములు 4. పరిశుద్ద గ్రంథపు పలుకులు - పరలోక తేనె చినుకులు = ప్రభు యేసుని మాటలు - మా వెల్గు బాటలు