sri yesu geethi paadana శ్రీ యేసు గీతి పాడవా ఆ సిల్వ ప్రేమ చాటవా
పల్లవి: శ్రీ యేసు గీతి పాడవా - ఆ సిల్వ ప్రేమ చాటవా (2X) జనులెందరో - నశించు చుండగా (2X) సువార్త చాట కుందువా - నాకేమిలే అందువా (2X) 1. ప్రభు ప్రేమను - రుచి చూచియు - మరి ఎవ్వరికి పంచవా పరలోకపు - మార్గంబును - పరులేవ్వరికి చూపవా (2X) ..సువార్త.. 2. ప్రతి వారికి- ప్రభు వార్తను - ప్రకటింప సంసిద్దమా పరిశుద్దుడే - నిను పంపగా - నీకింక నిర్లక్ష్యమా 2X) ..సువార్త..