ontarivi kaavu aenaadu neevu nee tho ఒంటరివి కావు ఏనాడు నీవు నీ తోడు యేసు
ఒంటరివి కావు ఏనాడు నీవు
నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2)
ఆలకించవా ఆలోచించావా
ఆనందించవా (2)
1. వెలివేసారని చింతపడకుమా
ఎవరూ లేరని కృంగిపోకుమా
ఒంటరితనమున మదనపడకుమా
మంచి దేవుడు తోడుండగా (2)
ఆత్మహత్యలు వలదు
ఆత్మ ఆహుతి వలదు (2)
2. బలము లేదని భంగపడకుమా
బలహీనుడనని బాధపడకుమా
ఓటమి చూచి వ్యసనపడకుమా
బలమైన దేవుడు తోడుండగా (2)
నిరాశ నిస్పృహ వద్దు
సాగిపోవుటే ముద్దు (2)