halleluya yesu prabhun హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
1. హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి పల్లవి: రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి 2. తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి నిరంతరము మారని యేసుని స్తుతియించుడి … రాజుల… 3. సూర్య చంద్రు లారఇల దేవుని స్తుతియించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి అగ్నివడ గండ్లారమీరు కర్తను స్తుతియించుడి హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి … రాజుల… 4. యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి … రాజుల… 5. అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి … రాజుల…