సర్వ కృపానిధీయగు ప్రభువా సకల చరాచర స౦తోషమా
sarvakrupaanidhiagu prabhuvaa
సర్వ కృపానిధీయగు ప్రభువా సకల చరాచర స౦తోషమా
స్తొత్రముచేసి స్తుతి౦చెదను స౦తసమున నిను పొగడెదను
అ:ప:హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను
ఆన౦దముతో సాగెదను నే నాన౦దముతో సాగెదను
1.ప్రేమి౦చి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షి౦చితివి
పరిశుద్ద జీవితము చేయుటకై పాపిని నను కరుణి౦చితివి
2.అల్పకాల శ్రమలనుభవి౦ప అనుదినము కృప నిచ్చితివి
నాధుని అడుగుజాడలలో నడచుటకు నను పిలచితివి
3.మరణ శరీరము మార్పునో౦ది మహిమ శరీరము పొ౦ధుటకై
మహిమాత్మతో నను ని౦పితివి మరణ భయములను తీర్చీతివి