yahovaa maaku thodugaa yesayya maa inta undagaa యెహోవా మాకు తోడుగా యేసయ్యా మా ఇంట ఉండగా
యెహోవా మాకు తోడుగా – యేసయ్యా మా ఇంట ఉండగా
శుద్ధాత్మ మాకు నీడగా – త్రిత్వాత్మ మాకుండగా
ఎడబాయలేదే నీ కృప మమ్ము – విడనాడ లేదెన్నడు
వివరించలేము వర్ణించలేము – నీ ఆశ్చర్య కార్యాలను
బహు వింతైన ప్రేమన్ – చూపావు మాపై
చాలయ్య మా ఇంట – నీ సన్నిధి
కమనీయమైన నీ ప్రేమ బంధం – కాచింది కనుపాపలా
కృపవెంబడి కృపతో నింపావు మమ్ము – కష్టాల కన్నీళ్ళలో
మా ప్రతి బంధకమును – విడిపించినావు
చాలయ్య మా ఇంట – ఈ దీవెన