చిందింది రక్తం ఆ సిలువ పైన
Chindindi Raktham Aa Siluva Paina
Translated from TELUGU to TELUGU
కారింది రుధిరం కలువరిలోన (2)
కరుణ చూప లేదే కసాయి మనుష్యులు
కనికరించలేదే మానవ లోకం (2) ||చిందింది||
ఏదేనులో పుట్టిన ఆ పాపము
శాపముగా మారి మరణ పాత్రుని చేసె (2)
ఆ మరణమును తొలగించుటకు
మరణ పాత్రను చేబూనావా (2)
నా మరణమును తప్పించినావా ||కరుణ||
చేసింది లోకం ఘోరమైన పాపం
మోపింది నేరం నీ భుజము పైనా (2)
యెరుషలేములో పారిన నీ రక్తము
ఈ లోక విమోచన క్రయధనము (2)
ఈ లోక విమోచన క్రయధనము ||కరుణ||
నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం
మరణపు ముల్లును విరిచిన దేవుడా (2)
జీవకిరీటము నిచ్చుటకై
ముళ్ళ కిరీటము ధరించితివా (2)
నాకు నిత్య జీవమిచ్చితివా ||కరుణ||
chindindi raktham aa siluva paina
kaarindi rudhiram kaluvarilona (2)
karuna choopalede kasaayi manushyulu
kanikarinchalede maanava lokam (2) ||chindindi||
aedenulo puttina aa paapamu
shaapamugaa maari marana paathruni chese (2)
aa maranamunu tholaginchutaku
marana paathranu cheboonaavaa (2)
naa maranamunu thappinchinaavaa ||karuna||
chesindi lokam ghoramaina paapam
mopindi neram nee bhujamu paina (2)
yerushalemulo paarina nee rakthamu
ee loka vimochana kraya dhanamu (2)
ee loka vimochana kraya dhanamu ||karuna||
nuvvu chesina thyaagam maruvaleni yaagam
maranapu mullunu virichina devudaa (2)
jeeva kireetamu nichchutakai
mulla koreetamu dharinchithivaa (2)
naaku nithya jeevamichchithivaa ||karunaa||